
అటు ఓజీలు(పాత కంటెస్టెంట్లు) విష్ణుప్రియను కంటెండర్‌గా సెలక్ట్ చేస్తే రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఏకంగా ఆమెను మెగా చీఫ్‌గా సెలక్ట్ చేశారు. గేమ్‌లో కనిపించట్లేదన్నవారితో సహా దాదాపు అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అందుకేనేమో బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ విష్ణుకు టఫ్‌గా ఉండేలా పెట్టాడు.
దీంతో ఆమె గౌతమ్, తేజ, హరితేజలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో గౌతమ్, యష్మికి మధ్య వాదులాట జరిగింది. నువ్వు ఆగు అక్కా.. అని గౌతమ్ అనగా.. నన్ను అక్కా అనకు, యష్మి అని పిలువు అని అరిచేసింది. ఒకసారి క్రష్, ఒకసారి అక్కా అని పిలవకు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక గౌతమ్, పృథ్వీ దమ్ము చూపించుకుందాం రా అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఈ వారం యష్మి, గౌతమ్, నయని పావని, హరితేజ, తేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment