
క్లాన్ (టీమ్) గొడవలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్.. ఓజీ, రాయల్ క్లాన్స్‌ను ఏకం చేసేశాడు. ఇకపై హౌస్ అంతా ఒకే ఒక్క మెగా టీమ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. వీరికి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ను నాలుగు టీమ్స్‌గా విభజించాడు.

పగ తీర్చుకున్న నిఖిల్ టీమ్
ఈ క్రమంలో నిన్న రెడ్ టీమ్.. బ్లూ టీమ్‌కు మొత్తం మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చింది. దీంతో బ్లూ టీమ్‌లో గంగవ్వను గేమ్ నుంచి సైడ్ చేశారు. తాజా ప్రోమోలో బ్లూ టీమ్ రెడ్ టీమ్‌పై పగ తీర్చుకుంది. ఇదివరకే ఓ ఎల్లోకార్డ్ ఇవ్వగా ప్రోమోలో మరో ఎల్లో కార్డ్ ఇచ్చారు. దీంతో ప్రేరణ, యష్మి, గౌతమ్.. తమలో ఎవరు సైడ్ అవ్వాలనేదానిపై చర్చించుకున్నారు. చివరకు గౌతమ్‌ను సైడ్ చేసేశారు.

కొత్త చీఫ్ ఎవరంటే?
ఇక తాడో పేడో టాస్కులో విజృంభించి ఆడిన నిఖిల్.. టాస్కుల్లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వారం నిఖిల్ బ్లూ టీమ్‌లోని సభ్యులే చీఫ్ అయ్యారట. ముక్కు అవినాష్ మెగా చీఫ్ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment