బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుగురు మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. ఈ రేసు నుంచి తొలగించాలనుకుంటున్న కంటెస్టెంట్ల ఫోటోలను కాల్చాల్సి ఉంటుంది.
విష్ణు ఫోటో కాల్చిన అవినాష్
ముందుగా అవినాష్.. విష్ణుప్రియ ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదు పర్సనాలిటీ కూడా అని చెప్పావు. గేమ్స్ ఆడుతున్నాం.. కానీ అది ఎలా ఆడుతున్నామనది ముఖ్యం అని నొక్కి చెప్పాడు. తర్వాత నిఖిల్, గౌతమ్ మధ్య వార్ మొదలైంది. పృథ్వీ, నేను.. ఇలా ఎవరో ఒకరు అవతల వ్యక్తిని అగౌరవపరిస్తే తప్పు.. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పా? అని నిఖిల్ ప్రశ్నించాడు. ఒప్పని నేనెప్పుడు చెప్పానని నిలదీశాడు. నీ ప్రవర్తనతోనే తెలిసిపోతుందని నిఖిల్ కోపంతో ఊగిపోయాడు.
కోపంతో ఊగిపోయిన నిఖిల్
ఇన్ని రోజులు ఈ స్వరంతో ఎందుకు మాట్లాడలేదు? అని గౌతమ్ అడగ్గా.. ఎందుకంటే ఇదే చివరి ఛాన్స్.. నువ్వు చేసిందంతా బయటకు రావాలి కదా అని బదులిచ్చాడు. ఇలా మాటామాటా అనుకునే క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు అని పెద్ద నింద వేశాడు. నువ్వు ఏదిపడితే అది అంటుంటే వినడానికి రాలేదు, ఇంకోసారి నోరుజారితే వేరేలా ఉంటుంది అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment