ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్‌.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల | Bigg Boss Telugu 8, Oct 12th Full Episode Review: Rising Stars and Falling Stars | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: మణి నోరు మూయించిన నాగ్‌.. ముగ్గురి బ్యాగులు గేటు దగ్గరే!

Published Sat, Oct 12 2024 11:34 PM | Last Updated on Sun, Oct 13 2024 9:51 AM

Bigg Boss Telugu 8, Oct 12th Full Episode Review: Rising Stars and Falling Stars

నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్‌ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్‌ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్‌ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్‌ 12) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

రైజింగ్‌ స్టార్స్‌
బిగ్‌బాస్‌ హోటల్‌ టాస్క్‌లో అవినాష్‌, తేజ దొంగతనంగా గులాబ్‌ జామ్‌ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్‌ జామ్స్‌ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్‌మేట్స్‌ ఆటను బట్టి వారిని రైజింగ్‌ స్టార్స్‌, ఫాలింగ్‌ స్టార్స్‌గా నాగ్‌ విభజించాడు.‍ గంగవ్వ, మెహబూబ్‌, అవినాష్‌, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్‌ స్టార్స్‌ అని పేర్కొన్నాడు.

నాతో గేమ్స్‌ద్దు
నువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్‌ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్‌ అవలేదన్నాడు. దీంతో నాగ్‌.. ఇప్పుడు కవరింగ్‌ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్‌ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్‌ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్‌ మరో లెవల్‌లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.

తేజకు పనిష్మెంట్‌
నబీల్‌, గౌతమ్‌, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్‌, సీతలను ఫాలింగ్‌ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్‌ అయిపోతావ్‌ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్‌ పీకాడు. 10 పుషప్స్‌ తీయమని పనిష్మెంట్‌ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్‌, సగం ఫాలింగ్‌ అని తెలిపాడు.

అవినాష్‌ దృష్టిలో అతడు స్ట్రాంగ్‌ కాదట!
ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్‌ గేట్‌ దగ్గర పెట్టాలన్నాడు నాగ్‌. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్‌.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ కాదంటూ నిఖిల్‌ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్‌.. సీత, మెహబూబ్‌.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించలేదని పేర్కొంది.

చివర్లో ముగ్గురి బ్యాగులు
తర్వాత ఓజీ టీమ్‌సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్‌ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్‌​ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్‌ చేయలేదంటూ గౌతమ్‌ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్‌, నబీల్‌.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్‌ బ్యాగుల్ని సర్దేసి స్టోర్‌ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్‌ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో సీత ఎలిమినేట్‌ కానుంది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement