కంటెస్టెంట్ల మధ్య పోటీ ఉంటేనే కిక్కుంటుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే నిఖిల్ విన్నర్ అని అంతా తేల్చేశారు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ అభిప్రాయం మారింది. నిఖిల్‌కు పోటీఇచ్చే వ్యక్తి దొరికాడని అనుకున్నారు. అతడే గౌతమ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన వారమే వెళ్లిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలవడమంటే మామూలు విషయం కాదు.
నోరు జారడం.. సారీ చెప్పడం
అయితే మొన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌ను.. యష్మిని వాడుకున్నావ్ అంటూ పెద్ద అభాండం వేయడం అతడికి భారీ మైనస్‌గా మారింది. ఓ రేంజ్‌లో పైకెళ్లిన గ్రాఫ్ ఢామ్మని కిందపడిపోయింది. నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌కు సారీ చెప్పి తన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు గౌతమ్.
ఈ ఇద్దరినీ కలిపేందుకు హౌస్‌లోకి చెఫ్ సంజయ్ అడుగుపెట్టాడు. అందరికోసం ఆయన దగ్గరుండి వంట చేశాడు. అలాగే గౌతమ్, నిఖిల్ మధ్య మంటను తగ్గించేందుకు ఒకరికొకరు తినిపించుకోండంటూ ఇద్దర్నీ కలిపేశాడు.. హౌస్‌మేట్స్‌తో సరదా గేమ్స్ కూడా ఆడించాడు.
Comments
Please login to add a commentAdd a comment