బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చాకే వైల్డ్ ఫైర్‌లా మారింది. మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ సీజన్‌లో ఐదుగురు ఫైనల్స్‌కు వచ్చారు. నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్ టాప్ 5లో ఉన్నారు. అసలు సిసలు పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొంది. గౌతమ్, నిఖిల్.. నువ్వా?నేనా? అన్న రీతిలో ఓటింగ్‌లో దూసుకుపోయారట!
గెస్టుగా అల్లు అర్జున్
వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడని ప్రచారం జరిగింది. నిజానికి గత సీజన్ ఫైనల్స్‌లోనూ మహేశ్‌బాబు అతిథిగా వస్తున్నాడని టాక్ నడిచింది. కానీ చివరికి ఆయన రానేలేదు. ఇక ఈ సీజన్‌లోనూ పుష్పరాజ్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కోసమైనా వస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు.
నాగార్జున చేతులమీదుగానే..
కానీ అంతలోనే సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు బన్నీని రాత్రంతా జైల్లోనే ఉంచి శనివారం ఉదయం రిలీజ్ చేశారు. జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ బిగ్‌బాస్ షోకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఈసారి కూడా నాగార్జున చేతులమీదుగానే విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చేయనున్నారన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment