
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైందే పద్నాలుగో మందితో! అందులో ఆరుగుర్ని పంపించేశాక ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను దింపారు. అప్పటినుంచి ఆట రసవత్తరంగా మారింది. అయితే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా పాత కంటెస్టెంట్లు సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. నిజానికి ఇందులో మణికంఠకు బదులు గౌతమ్ వెళ్లిపోవాల్సింది.
కానీ ఆరోగ్యం సహకరించడం లేదంటూ మణి స్వతాహాగా బయటకు వచ్చేశాడు. ఇక గౌతమ్ మెగా చీఫ్ కావడంతో ఎనిమిదో వారం నామినేషన్స్ నుంచి బతికిపోయాడు. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారట.. గౌతమ్ తనకున్న పవర్‌తో హరితేజను నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేసినట్లు సమాచారం! మరి ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేవ్ అవుతారనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment