హమ్మయ్య.. సీరియల్స్ గోల ముగిసిపోయింది. బిగ్‌బాస్ షోలోనూ బుల్లితెర సెలబ్రిటీలను పంపి సీరియల్స్ ప్రమోషన్ చేయించారు. ఇక దానికి ఫుల్‌స్టాప్ పెట్టి టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది.
కోరుకున్న ప్రేమ దక్కకపోయినా..
అందులో గౌతమ్ తన ప్రయాణానికి సంబంధించిన గుర్తులను, జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. ఇక బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. కాస్త (యష్మి దగ్గర) ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అప్పటినుంచి పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది.
చివరి మజిలీ
మీ పంథా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్టుగా చివరి మజిలీకి చేరుకున్నారు అంటూ జీరో నుంచి హీరో అయిన ప్రస్థానాన్ని తెలియజేస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ ప్రశంసలతో పొంగిపోయిన గౌతమ్.. చివరగా ఓ మంచిమాట చెప్పాడు. అమ్మానాన్నల కోసం బతకండి.. వారిని మించిన దైవం లేదు అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment