
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

రెండు జంటల డ్యాన్స్ హైలైట్
బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.

డైలాగ్ డెడికేషన్
హౌస్‌మేట్స్‌పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్‌ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది.

నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు
తేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందంది. తు సమ్‌జా.. నై సమ్‌జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి.

బేసిక్ సెన్స్ ఉండదు
నాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ.

మణికంఠ ఎలిమినేట్
తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు.

ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడు
అటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్‌మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు.

మునిగిపోతావ్, జాగ్రత్త..
తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు.




Comments
Please login to add a commentAdd a comment