
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో నిఖిల్, గౌతమ్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. మొన్న గౌతమ్ నోరు జారి.. తన స్థాయిని తనే తగ్గించుకోగా నేడు నిఖిల్ వంతు వచ్చినట్లుంది. ఎదుటివారికి గౌరవం ఇవ్వవు అని గౌతమ్‌ను తప్పుపట్టే నిఖిల్.. నేడు అతడిని చులకన చేసి మాట్లాడాడు. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది.

గోల్డెన్ టికెట్ అందుకున్నవారికి ఆఫర్
పోయినవారం గోల్డెన్ టికెట్ అందుకున్న నిఖిల్, గౌతమ్, రోహిణిలలో ఒకరికి ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ఈ ముగ్గురికి కేక్ గేమ్ ఇచ్చాడు. ఇందులో రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరికి బిగ్‌బాస్ రంగు పడుద్ది అనే గేమ్ పెట్టాడు. ప్రత్యర్థి టీషర్ట్‌పై వీలైనంతవరకు రంగు పూయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో నిఖిల్, గౌతమ్ పోటాపోటీగా ఆడారు.

నిఖిల్ వెకిలి మాటలు
గేమ్ అయ్యాక.. గౌతమ్ నన్ను కొట్టాడని నిఖిల్ అన్నాడు. రంగు పూయబోతుంటే తగిలింది.. అలా అంటే నువ్వు నన్ను కిందపడేసి ఈడ్చుకుంటూ పోయావా? లేదా? అని గౌతమ్ ప్రశ్నించాడు. దానికి నిఖిల్ సమాధానమివ్వకుండా పక్కకెళ్లి కూసో బే అని కామెంట్ చేశాడు. బే అని ఎవడ్ని అంటున్నవ్? అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.
కావాలని కొట్టినా కొడతావు
నీకు ఆడే విధానం లేదు, నన్ను కొట్టావని మరోసారి ఆరోపించాడు నిఖిల్. గేమ్‌లో ఎవడైనా కావాలని కొడతాడా? అని గౌతమ్ అంటుంటే కూడా ఎవరికి తెలుసు? నువ్వు కావాలని కొట్టినా కొడతావు అంటూ నిఖిల్ మరింత రెచ్చగొట్టాడు. ఇకపోతే ఈ గేమ్‌లో నిఖిల్ గెలిచిన ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment