
నామినేషన్స్.. ఈ రోజు కోసమే కదా ప్రేక్షకులు ఎదురుచూసేది! వారికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరికేది నామినేషన్స్‌లోనే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ.. నిన్ను విజేతగా చూడలేనంటూ ప్రేరణను నామినేట్ చేసింది. ఇక గౌతమ్.. నిఖిల్, ప్రేరణ, పృథ్వీతో గొడవపడ్డాడు.
నీకోసం కట్టుకోలేదు
నువ్వు కట్టుకున్న చీర నచ్చలేదని గౌతమ్ అనగా నీకోసం నేను ఈ చీర కట్టుకోలేదని ప్రేరణ అంది. కదా.. మరి నేను కూడా నీకోసం ఇక్కడ ఉండటానికి రాలేదు అని సోలో బాయ్ సెటైర్లు వేశాడు. ఇమ్యూనిటీ షీల్డ్ రావడానికి నీకు అర్హత లేదని ప్రేరణ అనగా.. దేనికీ నాకు అర్హత లేదు కదా గౌతమ్ అసహనం వ్యక్తం చేశాడు.

నీ కాళ్లపై పడి దండం పెట్టాలా
నువ్వు మనుషుల్ని ట్రిగ్గర్ చేస్తావని ప్రేరణ అనడంతో.. ట్రిగ్గర్ చేయాలని చేయలేదు.. నీ కాళ్లపై పడి దండం పెట్టాలా చెప్పు? ఇలా అంటారనే నేను సైలెంట్ అయిపోయా.. అంటూ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇక అవినాష్.. పృథ్వీని నామినేట్ చేస్తుంటే అతడి కనీసం లేచి నిలబడలేదు. నిల్చుని మాట్లాడితేనే నామినేట్ చేస్తానన్నాడు అవినాష్. మెగా చీఫ్ రోహిణి, నబీల్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment