'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా? | Prabhas Salaar Movie TV TRP Details Latest | Sakshi
Sakshi News home page

Salaar Movie: ఫ్లాప్ సినిమాల కంటే దారుణంగా 'సలార్' పరిస్థితి!

Published Fri, May 3 2024 2:44 PM | Last Updated on Fri, May 3 2024 3:01 PM

Prabhas Salaar Movie TV TRP Details Latest

డార్లింగ్ ప్రభాస్‌కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.

థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement