బిగ్‌బాస్‌ 4: కెమెరా, యాక్షన్‌ వాట్‌ ఏ వావ్‌.. | Actor Nagarjuna To Host Bigg Boss Telugu Season 4 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హోస్ట్‌గా నాగార్జున‌

Aug 1 2020 12:33 PM | Updated on Aug 1 2020 1:53 PM

Actor Nagarjuna To Host Bigboos Telugu  Season 4  - Sakshi

హైదరాబాద్‌ : టెలివిజ‌న్ రంగంలో బిగ్‌బాస్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అంతా స‌వ్యంగా జ‌రిగితే ఈ పాటికి ఈ షో మొద‌ల‌య్యేది. కానీ క‌రోనా నేప‌థ్యంలో బిగ్‌బాస్-4కు కాస్త బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ షో ప్రారంభం కానుంద‌ని స్టార్‌ మా అధికారిక ప్రకటన చేసింది. ఈ నేప‌థ్యంలో అస‌లు బిగ్‌బాస్‌ సీజన్‌-4కుహోస్ట్ ఎవ‌రు ఉంటారన్న దానిపై ర‌క‌రకాల వార్త‌లు ప్ర‌చారంలో వచ్చాయి. వీట‌న్నింటికి తెర‌దించుతూ బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్, కెమెరా యాక్ష‌న్ అంటూ నాగార్జున ఓ ట్వీట్ చేశారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని, వ్యాఖ్యాత‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్టార్‌మా సైతం ప్ర‌క‌టించింది. (బిగ్‌బాస్‌-4పై ‘స్టార్‌ మా’ ప్రకటన)

బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా నాగార్జున త‌న‌దైన శైలిలో షోను ఆసాంతం ర‌క్తి క‌ట్టించారు. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయ‌నున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4 హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని సమాచారం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వహకులు సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్‌ టాస్క్‌లు లేకుండా.. షోను డిఫరెంట్‌గా ఏమైనా ప్లాన్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బిగ్‌బాస్ సీజ‌న్-4లో కంటెస్టెంట్‌లు ఎవ‌రన్న దానిపై ఆస‌క్తి  నెలకొంది.  (బిగ్‌బాస్ 4: ఆమెకు ఎపిసోడ్‌కు ల‌క్ష‌?)

What a Wow-Wow!!! #BiggBossTelugu4

A post shared by STAR MAA (@starmaa) on


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement