తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మంగళవారం పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు.