
రేణు దేశాయ్‌తో స్టార్ మా రియాలిటీ షో
సాక్షి, హైదరాబాద్: రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుపరిచయం. భర్త పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలతో పూణేలో ఉంటున్నారు. సినిమాల పై ఉన్న ఫ్యాషన్‌తో రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. కొడుకు అకీరా నందన్ ఆచిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ కూడా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం.
ఇప్పటికే తారక్ బిగ్‌బాస్ షో, రానా నెం.1 యారీ ప్రోగ్రాంలతో చిన్న స్క్రీన్‌పై మెప్పిస్తున్నారు. తాజాగా రేణు కూడా ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ప్రముఖ తెలుగు చానెల్ స్టార్‌మా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ సీజన్ అనంతరం ‘స్టార్ మా’ రేణుదేశాయ్‌తో రియాలిటీ డాన్స్ షో ప్లాన్ చేస్తోంది. రేణు హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ డాన్స్ షో పై అంతా ఆసక్తిగా ఉన్నారు.