
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కోసం ఎదురుచూసిన అభిమానులకు నేటి (సెప్టెంబర్ 1) నుంచి పండుగే అని చెప్పవచ్చు. నాగార్జున హౌస్ట్‌గా మరోసారి ఈ సీజన్‌లో కూడా మెప్పించనున్నాడు. తాజాగా విడుదలైన మొదటి ప్రోమో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఈ సీజన్ లిమిట్‌లెస్ అంటూ నాగార్జున చెప్పారుజ అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్‌ను సోలోగా పంపకుండా జోడీలుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు.
అయితే, ప్రోమోలో నాని-ప్రియాంక మోహన్ సందడి చేశారు. 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను నాగ్‌తో పంచుకున్నారు. ఆపై '35 చిన్న కథ కాదు' ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ సరదాగా మెప్పించారు. చివరిలో దర్శకుడు అనిల్ రావిపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 7గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment