ఈ వారం హౌస్‌లోని కంటెస్టెంట్ల మనసులో ఉన్న ముసుగులను తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్ పర్వంలో వాడాడు బిగ్ బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్థం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పవచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. యథావిధిగా నామినేషన్‌లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్ల మధ్య పోటీగా నిర్వహించిన వినూత్న బెలూన్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.
(చదవండి: కాలేజీలో మోసపోయానన్న యష్మి.. కన్నింగ్, సెల్ఫిష్ 'మణికంఠ' ఏడుపు)
ఒక్క నామినేషన్‌లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు బిగ్ బాస్ తట్టుకోలేకపోయాడు. అంతే బెలూన్ కాంటెస్ట్ ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది... ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్ బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడుతున్నారు ప్రస్తుత కంటెస్టెంట్స్. ఇక ఇదంతా ఒక ఎత్తయితే గత వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈ సోనియాని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు... హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా కంటెస్టెంట్స్‌లోని మిగతా లేడీ పార్టిసిపెంట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఎలిమినేట్ అయిన తరువాత ఈ విషయాన్ని నాగార్జునతో సోనియా బాహాటంగానే అందరి ముందు చెప్పింది.
(చదవండి: విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల)
కండబలం ఉన్నవారికి గుండెబలం తక్కువ ఉంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్. సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్. పృథ్వీ కూడా నిఖిల్‌తో జత కలిశాడు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో కూడా నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించారు. వారం మధ్యలో ఒక ఎలిమినేషన్ ఉంటుంది అని ప్రకటించారు. చెప్పినట్లుగానే మిడ్ వీక్‌లో ఆదిత్యను ఎలిమినేట్ చేశాడు. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్ల దగ్గర నుండి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్ బాస్. మరి ఈ మాజీలతో మసాల వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment