అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్‌ మా' నటీనటులు | Star Maa Actress Celebrate With Fans Bathukamma | Sakshi
Sakshi News home page

అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్‌ మా' నటీనటులు

Published Thu, Oct 19 2023 8:09 PM | Last Updated on Thu, Oct 19 2023 8:25 PM

Star Maa Actress Celebrate With Fans Bathukamma - Sakshi

దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా  పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు.

దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్‌ హిట్‌ పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేశారు.  అనంతరం వారితో ఫ్యాన్స్‌ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు.

ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు..  ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్‌ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement