ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ హరిత
వరంగల్ రూరల్ : వరంగల్ రూరల్ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో రైతు లు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 75 కేంద్రా లు ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.హరిత తెలిపారు. ఖరీఫ్ కొనుగోళ్లపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు.
వ్యవసాయశాఖ, పౌర సరఫరాలశాఖ, డీఆర్‌డీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 75 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందు లో 18 కేంద్రాలు డీఆర్‌డీఏ-ఐకేపీ ద్వారా ఏర్పాటు చేయనుండ గా, మిగతావి పీఏసీఎస్‌లు, సివిల్ సప్లై శాఖ ద్వారా ఏర్పాటుచేయించాలన్నారు. ఏ-రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ రకానికి రూ.1,470 మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
గన్నీ బ్యాగులు, లారీలు, మినీవాహనాలు, ట్రాక్టర్లు, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు, తూకానికి కాంటాలు సమకూర్చుకోవాలని సూచించారు. కాగా, జిల్లాలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ వై.శేఖర్‌రెడ్డి, జేడీఏ ఉష, డీఎస్‌ఓ ఎస్‌డబ్ల్యూ.పీటర్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుకు 75 కేంద్రాలు
Published Sat, Oct 15 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement
Advertisement