భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది
నంద్యాల: తాను లేని సమయంలో తన భర్త మరో మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండగా... అతగాడ్ని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... డాక్టర్ రాఘవరెడ్డి గతంలో తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా రోగితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం డాక్టర్ తన ఇంట్లోనే ఆమెతో సన్నిహితంగా ఉండగా గమనించిన భార్య హరిత బయటి నుంచి తలుపుకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.