'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ | Ramnagar Bunny 2024 Movie Review And Rating In Telugu | Podakandla Chandrahass | Richa Joshi | Sakshi
Sakshi News home page

Ramnagar Bunny Movie Review: యాటిట్యూడ్ స్టార్ట్ తొలి సినిమా.. హిట్ కొట్టాడా?

Published Fri, Oct 4 2024 1:07 PM | Last Updated on Fri, Oct 4 2024 1:50 PM

Ramnagar Bunny Review And Rating In Telugu

యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తన మేనరిజం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కుర్రాడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ 'రామ్‌నగర్ బన్నీ'. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎలా ఉంది? యాటిట్యూడ్ స్టార్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)

కథేంటి?
రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సోషల్ మీడియా పుణ్యాన ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారనేది చెప్పలేం. అలా ఫేమస్ అయిన కుర్రాడు చంద్రహాస్. ఇతడి పేరే మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. కానీ దీన్ని ట్యాగ్ లైన్ వాడేసి మనోడి కొత్త సినిమాని తీసుకొచ్చేశారు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటినుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీశారు.

ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు. అతడికో ఫ్యామిలీ. పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, కొన్నాళ్ల లవ్ చేసిన తర్వాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెని వదిలేస్తాడు. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్లిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉందని తెలుసుకుంటాడు. తర్వాత ఏమైంది? ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తార అనే ఆంటీ ఎవరు అనేది చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్.. మధ్యలో ఓ నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీస్ ఇష్టముంటే 'రామ్‌నగర్ బన్నీ' మీకు నచ్చేయొచ్చు. రెండున్నర గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి తప్పితే ఓవరాల్‌గా చల్తా చల్తా ఎంటర్‌టైనర్.

ఎవరెలా చేశారు?
యాట్యిట్యూడ్ అని ట్రోల్ చేస్తే, దాన్నే తన పేరుగా మార్చుకున్న చంద్రహాస్.. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్నింట్లో బాగానే కష్టపడ్డాడు. శైలుగా చేసిన విస్మయ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన అమ్మాయిలు మిగతా ముగ్గురు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ విషయాలకొస్తే రెండు మూడు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ తీసుకున్న లైన్ పాతదే. కానీ కాస్త మెరిపించే ప్రయత్నం చేశాడు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం గానీ పాస్ అయిపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చూస్తే యాటిట్యూడ్ స్టార్ ఎంట్రీ టెస్టులో పాస్ అయిపోయినట్లే!

-చందు డొంకాన.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement