బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆఖరి దశకు వచ్చింది. అలాగే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌లో కంటెంట్ కూడా బాగా తగ్గిందనే విషయం ఈ వారం ఇంకా బాగా కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ వారం ఆరంభం ఆఖరి నామిమేషన్స్ తో మొదలవగా టాప్ 5 ఫైనలిస్టులతో వారం ముగిసింది. ఆఖరి నామినేషన్స్ కాబట్టి, కంటెస్టెంట్స్ వాళ్ళ వాడే భాష డోసు పెంచి (అంటే పరుషపదజాలం వాడుతూ) బిగ్ బాస్‌కు కాస్త ఆనందం కలిగించారు. ఒక్క అవినాష్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఇంక అవడానికి, చేయడానికి ఎవరూ లేరు కాబట్టి. దాని తరువాత ఓట్ అప్పీల్ కోసం కొన్ని వింత టాస్కులతో ఆఖరి దశలోని ఓ వివాద అంకాన్ని పూర్తి చేశాడు బిగ్ బాస్.
హౌస్‌లో వున్న కంటెస్టెంట్స్ దగ్గర కంటెంట్ ఇక రాదు అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ బయట నుండి పర్ఫామర్స్‌ని తెప్పించి అటు కంటెస్టెంట్స్‌ను ఇటు ఆడియన్స్‌ను మెప్పించడానికి ప్రయత్నించాడు బిగ్ బాస్. కంటెంట్ లేక ఫుల్ కవరేజ్ కోసం వీకెండ్‌లో కాస్త ఓవరాక్షన్ టాస్కులను కంటెస్టంట్స్ చేత చేయించి మితిమీరాడు బిగ్ బాస్. దానిలో భాగంగా డాన్స్ టాస్కులలో మన సంస్కృతికి మణిహారమైన సాగరసంగమం చిత్రంలోని తకిటతథిమి... పాటను అసభ్యకరమైన పోల్ డాన్సు రూపాన వికృత భంగిమలతో నాట్యం చేయించడం ఒకటైతే, సంప్రదాయమైన నాట్య రూపాలతో హేయమైన ఊ... అంటావా ఊహూ అంటావా... పాటలతో చేయించడం రెండోది.
కంటెంట్ కోసం వినూత్నంగా విభిన్నంగా ఆలోచించి ఆచరించడం మంచిదే, కాని ఇలాంటి విపరీత, వింత పోకడలతో వినోదాన్ని పంచడం ఎంతవరకు సబబు. నాలుగు డబ్బులు కోసం మన సంస్కృతిని కించపరిచేంత దిగజారాలా బిగ్ బాస్. ఎంత కంటెంట్ నిల్లయితే మాత్రం కవరేజ్ కోసం ఇటువంటి కతలవసరమా.. ఇంకో వారం ఇంకెలాంటి విడ్డూరాలు చూడాల్సివస్తుందో...
- హరికృష్ణ ఇంటూరు
Comments
Please login to add a commentAdd a comment