
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం మహా కాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీకే నరేష్, పవిత్రా లోకేశ్, దేవాలయ ధర్మకర్త పట్టపాగులవెంకట్రావు, ఎం.సి. వాసు నటిస్తున్నారు. నటి పవిత్ర లోకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీకే నరేష్ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ఉత్తర భారతంలో ఉజ్జయిని దేవాలయాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతంలో రాజమండ్రి గోదావరి తీరాన పట్టపాగుల వెంకట్రావుగారి ఆధ్వర్యంలో మహా కాళేశ్వర ఆలయం నిర్మించారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment