
అతిపెద్ద రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో పాల్గొన్నారు టీవీ నటి పవిత్ర పూనియా. హౌస్‌లో ఆమె ఈజా ఖాన్‌తో సన్నిహితంగా ఉండటమే కాక ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత ఒక అమ్మాయిని ఇంతలా ఇష్టపడుతున్నాను అని ఈజా ఖాన్ మనసులోని మాటను బయట పెట్టాడు. బయటకు వెళ్లాక తన తండ్రిని కలవాలని పవిత్రకు సూచించాడు. ఇలా వీరి ప్రేమాయణం సాగుతున్న సమయంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మీద సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ నటి పవిత్ర పూనియా తన భార్య అని ఓ హోటల్ యాజమాని సుమిత్ మహేశ్వరి వెల్లడించాడు. ఆమె తనను నాలుగు సార్లు మోసం చేసిందని వాపోయాడు. కానీ పవిత్ర మాత్రం తనకు నిశ్చితార్థం జరిగిందే తప్ప, పెళ్లి కాలేదని పేర్కొనడం గమనార్హం. (బిగ్‌బాస్: ఆఖరి ఎపిసోడ్ అప్పుడే!)
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ మాట్లాడుతూ.. మేము ఇప్పటికీ భార్యాభర్తలమే. మాకు నిశ్చితార్థంతోపాటు పెళ్లి కూడా జరిగింది. ఆమె ఈ విషయాన్ని బయటకు చెప్పడంలేదు. పెళ్లి తర్వాత తను నా భార్య అన్న విషయం మర్చిపోయి పరాస్ ఛాబ్రాను ప్రేమించింది. వారి ప్రేమ విషయం తెలిశాక నేను అతడికి మెసేజ్ చేశాను. మా విడాకులు అయ్యాక మీ రిలేషన్‌ను కొనసాగించండని, అప్పటివరకు వేచి ఉండమని అతడికి చెప్పాను. ఇప్పటికీ నా చేతి మీద ఆమె టాటూ ఉంది. నాలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పుకొచ్చాడు. పరాస్ సైతం పవిత్ర చేతిలో తను మోసపోయిన తీరును ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. పవిత్ర భర్త మెసేజ్ చేసేవరకు ఆమెకు పెళ్లయిందన్న విషయమే తెలీదని చెప్పాడు. దీనిగురించి ఆమెను నిలదీస్తే తన తప్పును అంగీకరించిందని పేర్కొన్నాడు. (అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..)
Comments
Please login to add a commentAdd a comment