
బిగ్‌బాస్ కంటెస్టెంటు, టీవీ నటి పవిత్ర పూనియా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకుని హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. పవిత్ర పూనియా తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారట. దీంతో గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర షూటింగ్ ఆపేసి సెట్స్ నుంచి వెళ్లిపోయారు. ఉన్నపళంగా ముంబై నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. (చదవండి: తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్)
"మనం పంచుకున్న నవ్వుల చిరుజల్లులు మిస్ అవుతున్నా నాన్నా.. నువ్వు త్వరగా కోలుకోవాలి, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కోరుకుంటున్నదాని కంటే ముందుగానే కోలుకుని మళ్లీ కళ్ల ముందు హుందాగా తిరుగాడాలి' అని రాసి ఉన్న ఫొటోను సైతం షేర్ చేశారు. ఆమె అభిమానులు కూడా పవిత్ర తండ్రి ఆరోగ్యవంతుడై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా పవిత్ర 2009లో 'స్ప్లిట్స్ విల్లా' అనే రియాలిటీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'యే హై మొహబ్బతే'లో నిధిగా ఆకట్టుకున్నారు. అలాగే హోంగే జుడా నా హమ్, కావచ్.. కాలి శక్తియాన్ సే, దయాన్ వంటి మరికొన్ని షోలలో సైతం పాల్గొన్నారు. ఇక ఇటీవలే బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయ్యారు. (చదవండి:ఇలా చేస్తుంటే కష్టం అన్నారు: బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్)
(చదవండి: పవిత్ర నా భార్య, నన్ను మోసం చేసింది)
Comments
Please login to add a commentAdd a comment