బిగ్‌బాస్‌ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీవనం.. ఇంతలో! | Eijaz Khan And Pavitra Punia Confirms That They Breakup | Sakshi
Sakshi News home page

Breakup: ప్రేమికుల దినోత్సవానికి ముందు షాకిచ్చిన జంట.. విడిపోతున్నామంటూ..

Published Tue, Feb 13 2024 12:49 PM | Last Updated on Tue, Feb 13 2024 3:17 PM

Eijaz Khan And Pavitra Punia Confirms That They Breakup - Sakshi

వాలంటైన్స్‌ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్‌ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఆల్‌రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్‌సైడ్‌ లవర్స్‌.. తమ ప్రేమను ఈసారైనా బయటపెట్టాల్సిందే, అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సిందే అన్న విధంగా ప్లాన్లు చేసుకుంటున్నారు. అంతా ప్రేమ మైకంలో ముగిని తేలుతున్న ఈ సమయంలో బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.

ఒకే ఇంట్లో ఉంటూ..
నటీనటులు ఇజాజ్‌ ఖాన్‌- పవిత్ర పూనియా.. హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నీ కలిసొస్తే.. అదే ఏడాది పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇదే నిజమని తేలిపోయింది. బ్రేకప్‌ నిజమని అంగీకరించారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండగా గత నెలలో ఇజాజ్‌ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. 

ఎక్స్‌పైరీ అయిపోయింది
బ్రేకప్‌ గురించి పవిత్ర మాట్లాడుతూ.. 'ప్రతిదానికీ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. ప్రేమ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రిలేషన్స్‌ కూడా కలకాలం ఉండిపోవు. కొన్ని నెలల క్రితమే ఇజాజ్‌, నేను విడిపోయాం. అప్పటికి, ఇప్పటికి అతడిని గౌరవిస్తూనే ఉన్నాను. తన క్షేమమే కోరుకుంటున్నాను. కానీ మా మధ్య ప్రేమబంధం మాత్రం ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చింది.

బ్రేకప్‌ నిజమే..
అటు ఇజాజ్‌ కూడా బ్రేకప్‌ నిజమేనని ఒప్పుకున్నాడు. పవిత్ర తన కెరీర్‌లో సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. కాగా పవిత్ర చివరగా నాగమణి అనే సీరియల్‌లో కనిపించింది. ఇజాజ్‌.. జవాన్‌ సినిమాలో కనిపించాడు. బిగ్‌బాస్‌ షో ద్వారా ఒక్కటైన ఈ జంట పలు ఈవెంట్లకు, షోలకు కలిసే వెళ్లేవారు. ఎంతో ముచ్చటగా కనిపించే ఈ లవ్‌ బర్డ్స్‌ విడిపోతున్నారని తెలిసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ధనుష్‌ పాటపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన మాజీ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement