చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.
రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్‌ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.
రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment