Senior Actor Naresh Tie The Knot With Actress Pavithra Lokesh - Sakshi
Sakshi News home page

Naresh-Pavithra Marriage: పెళ్లి చేసుకున్న నరేశ్‌-పవిత్ర?

Published Fri, Mar 10 2023 11:18 AM | Last Updated on Fri, Mar 10 2023 12:26 PM

Senior Actor Naresh Tie Knot With Actress Pavithra - Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్‌లో పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్‌కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్‌-పవిత్రలు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం

ఈ ఏడాది న్యూ ఇయర్‌ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్‌-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్‌ కోసం పవిత్రతో రిలేషన్‌పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్‌.. ఇప్పుడు కూడా అదే స్టంట్‌ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement