తొమ్మిదో ఏట ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వీకే నరేశ్. పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే అతడు ‘ఐఎస్ సీఏహెచ్‌ఆర్(ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్)’ నుంచి 'సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నాడు.
సగం మంది విడాకులే
వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ నటి పవిత్ర లోకేశ్‌తో కలిసి జీవిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవిత్రతో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. దీనికి నరేశ్ స్పందిస్తూ ముందుగా ఏవేవో లెక్కలు వేశాడు. 'ప్రపంచంలో దాదాపు సగం మంది విడాకులు తీసుకుంటున్నారు. 70% మంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. విడిపోయి ఎవరికి వారు సొంతంగా బతుకుతున్నారు. మంచి, చెడ్డ పక్కన పెడితే ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండాలి.
ముందు సంతోషంగా లేను
అలాగే తోడు లేకుండా ఉండలేమా? అంటే 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు అవసరం. ఈ సమయంలో సరైన భాగస్వామి అవసరం. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల సంతోషంగా లేను. అందుకే విడాకులు తీసుకున్నాను. నేను సెలబ్రిటీ కాబట్టి విమర్శలు, వివాదాలు వస్తాయి. అన్నింటితో పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం పవిత్రతో నేను సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: థియేటర్‌లో సినిమా చూసి జక్కన్న.. కీరవాణి నిద్రపోతున్నాడా?
Comments
Please login to add a commentAdd a comment