సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నటుడు నరేశ్. దివంగత నటి, దిగ్గజ దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఇతడు తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఈయన సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు కావస్తుండగా తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని నరేశ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఐక్యరాజ్య సమతి అనుబంధ సంస్థ అయిన ఐఎస్ సీఏహెచ్‌ఆర్ (ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్) నుంచి ఆయన సార్ అనే బిరుదుతో పాటు డాక్టరేట్‌ను అందుకున్నాడు.
నాలో స్ఫూర్తిని నింపింది..
అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై ప్రసంగించినందుకుగానూ నరేశ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. అంతేకాదు ఇకపై నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్ అనే హోదా చేరుతుంది. ఈ సంతోషం నరేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అతడు తన గోల్డెన్ జూబ్లీ గురించి ఆసక్తికర పోస్ట్ వేశాడు. అలాగే తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిన పాటను షేర్ చేశాడు.
ఇష్టమైనవాళ్లు వదిలేసి పోయారు..
'నా జీవితం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఈ పాట నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. ఆ సమయంలో నేను కెరీర్ కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇష్టమైనవాళ్లు శాశ్వతంగా దూరమయ్యారు. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఓ జోకర్ నాపై పనికిరాని కేసు వేసినప్పటికీ నా తల్లి, స్నేహితుడు విజయ్ మద్వా మాత్రమే నాకు అండగా నిలబడ్డారు. సుమారు 100 కిలోల దాకా బరువు ఉండే నేను ఇప్పుడిలా మారిపోయాను. ఈ పాట నాలో స్ఫూర్తిని నింపడమే కాదు, నేను శక్తివంతంగా కమ్‌బ్యాక్ ఇచ్చేలా చేసింది.
డిప్రెషన్‌లో అప్పుడలా.. ఇప్పుడిలా..
నేనిప్పుడు సినీప్రయాణంలో 50వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మైలురాయిని అందుకోవడంతో తోడ్పడిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రియురాలు పవిత్ర లోకేశ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన వీడియోలను సైతం సదరు పోస్ట్‌లో పొందుపరిచాడు. అలాగే 2003లో డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాను? 2023లో గోల్డెన్ జూబ్లీ వచ్చినప్పుడు ఎలా ఉన్నానో తెలియజేస్తూ అప్పటి, ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టాడు నరేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
This one song, inspired me during the toughest period of my life, losing my career, facing financial strain, and the departure of supposed loved ones.
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 29, 2023
Despite heckling from relatives and being labeled a 'fome case' and a joker, only my Mother and friend Vijay Wadhwa stood by… pic.twitter.com/GXRqneF0CS
Comments
Please login to add a commentAdd a comment