![Before Pavitra Lokesh Actor Naresh Married For Three Times - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/31/Naresh_650x400.jpg.webp?itok=lOZge63-)
నటుడు నరేష్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను షేర్ చేయగా పవిత్రా-నరేష్‌ల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గతంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చాయి.
మొదటగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లిచేసుకున్నాడు.వీరి కొడుకే హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు.
ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి కాపురం వీరిబంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో ఆమెకు దూరంగా ఉన్న నరేష్ కొన్నాళ్లుగా పవిత్రాలోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారు.
ఇటీవలె ఓ హోటల్ రూమ్‌లో నరేష్-పవిత్రా లోకేశ్‌లను నరేష్ మూడోభార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది కూడా. సీన్‌కట్ చేస్తే.. ఇప్పుడు 62ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు నరేష్.
Comments
Please login to add a commentAdd a comment