దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగా ఉంది. శనివారంనాడు పవిత్రగౌడను చూడడానికి ఆమె తల్లి వచ్చారు. కూతురికి ఒక బాక్స్‌ను ఇవ్వగా జైలు సిబ్బంది నిరాకరించారు. ఇంటి నుండి తెచ్చిన తినుబండారాలను పెట్టుకోవడానికి పవిత్రగౌడ ఒక పెట్టెను తీసుకురమ్మని తల్లిని కోరిందట. అందువల్ల పవిత్ర తల్లి బాక్స్‌ను తీసుకువచ్చింది. అయితే బయటి నుండి తీసుకువచ్చే పాత్రలను లోపలకు అనుమతించబోమని, అది జైలు నిబంధన అని సిబ్బంది అడ్డుకున్నారు.
దాడి దృశ్యాలు వీడియో?
రేణుకాస్వామిపై దాడిని హీరో దర్శన్, అనుచరులు ఐఫోన్‌లో రికార్డు చేసినట్టు తెలిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోగానే ఒక నిందితుడు తన ఐఫోన్‌లో వీడియో తీశాడు. నిందితులకు 5 సిమ్‌కార్డులు అందజేసిన వారిని పోలీసులు విచారణ జరిపి వాంగ్మూలాన్ని రికార్డు చేసారు. దర్శన్, పవిత్ర గౌడలు తలా ఒక సిమ్‌కార్డు తీసుకున్నారు.
సీఎంతో రేణుకాచార్య తల్లిదండ్రుల భేటీ
శివాజీనగర: రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర, మరో 15 మంది అరెస్టు కావడం తెలిసిందే. సీఎంను కృష్ణా నివాసంలో కలిసి తల్లిదండ్రులు తమ బాధను వెలిబుచ్చారు. అనాథగా మారిన తమ కోడలికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిద్దరామయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment