మహబూబ్‌నగర్: భార్యాభర్తలు గొడవ పడగా.. భార్య గొంతు నులిమి భర్త హత్య చేసినట్లు గ్రామస్తులు కేటీదొడ్డి ఎస్‌ఐ వెంకటేష్ తెలియజేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇర్కిచేడుకి చెందిన నాగేష్ ధరూరు మండలం మన్నాపురానికి చెందిన పవిత్ర(23)తో 3 సంవత్సరాల కిందట వివాహమైంది. గతేడాది నుంచి భార్యతో తరచూ గొడవ పడేవాడు.
అయితే పెద్దలు, తల్లిదండ్రులు సర్ధిచెప్పి సంసారానికి పంపించేవారు. ఈ క్రమంలో గురువారం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య గొంతు నులిమి గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం సమీపంలోని వాగు వద్ద పడేసి, ఆమెపై చెట్లకొమ్మలు పడేశాడు. ఆ తర్వాత మీ చెల్లెలు కనిపించడం లేదని పవిత్ర అన్నకు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో పవిత్ర కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతంలో వెతికి శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. వారు ఈ విషయమై కేటీదొడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. వారికి బాబు, పాప పిల్లలున్నారని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment