Sudigali Sudheer’s Gaalodu Movie Motion Poster Released On His Birthday - Sakshi
Sakshi News home page

Galodu Movie: పక్కా మాస్‌ లుక్‌లో సుడిగాలి సుధీర్‌

Published Thu, May 20 2021 6:34 AM | Last Updated on Thu, May 20 2021 11:18 AM

Sudigali Sudhee Galodu poster release - Sakshi

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ ’ చిత్రం తర్వాత సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బుధవారం (మే 19) సుధీర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ప్రకటించి,  ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. సంస్కృతి ఫిలింస్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ‘‘సుధీర్‌కి మాస్‌లో ఎంత ఇమేజ్‌ ఉందో చెప్పడానికి మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రానికి వచ్చిన భారీ ఓపెనింగ్స్‌ నిదర్శనం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ‘గాలోడు’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement