మాస్‌ గోట్‌గా సుడిగాలి సుధీర్‌ | Sudigaali Sudheer GOAT Movie Teaser | Sakshi
Sakshi News home page

మాస్‌ గోట్‌గా సుడిగాలి సుధీర్‌

Published Tue, Aug 22 2023 1:45 AM | Last Updated on Tue, Aug 22 2023 6:46 AM

Sudigaali Sudheer GOAT Movie Teaser - Sakshi

సుడిగాలి సుధీర్, దివ్యభారతి

సుడిగాలి సుధీర్‌  హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). దివ్య భారతి హీరోయిన్‌. ‘పాగల్‌’ ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ వీడియోలో ఒక చేత్తో క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్‌ కాల్చుతూ మాస్‌ లుక్‌లో కనిపించారు సుధీర్‌. ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి’’ అన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement