Divya Bharti
-
దివ్య భారతి అందాల విందు.. అషూ రెడ్డి ఎప్పటిలానే అలా!
పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న దివ్య భారతిపరువాలన్నీ చూపిస్తూ అషూరెడ్డి అందాల జాతరకుందనపు బొమ్మలా తమిళ బ్యూటీ దివ్య దురైస్వామిచీరలో నవ్వులు చిందిస్తున్న 'బిగ్ బాస్' అలేఖ్య హారికనైట్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన పూనమ్ బజ్వాఅక్కకి ఏ మాత్రం తగ్గకుండా ఖుషి కపూర్ అందాల రచ్చ View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priyanka Sahajananda (@impriyankasahajananda) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Vaidehi Parashurami (@parashuramivaidehi) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Tina Datta (@tinadatta) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Chaithra J Achar (@chaithra.j.achar) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) -
దివ్య భారతి చనిపోవడానికి కారణమదే.. హీరో షాకింగ్ కామెంట్స్
దివ్య భారతి.. ఈ హీరోయిన్ పేరు ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు. వెంకటేశ్ 'బొబ్బిలి రాజా' మూవీలో తనదైన యాక్టింగ్ తో కట్టిపడేసింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో కేవలం 19 వయసులోనే ఐదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. అసలేం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. తాజాగా ఓ బాలీవుడ్ హీరో దివ్య భారతి మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన దివ్య భారతి.. పలువురు అగ్రహీరోలతో కలిసి పనిచేసింది. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా కమల్ సదానా అనే బాలీవుడ్ హీరోతో కలిసి షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్య భారతి ప్రమాదవశాత్తూ చనిపోయిందనే అనుకుంటున్నానని అన్నాడు. (ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి) 'దివ్య భారతి మరణవార్త నేను తీసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ ఆమె. కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉండేది. అందుకే చనిపోయిందని ఫస్ట్ వినగానే షాకయ్యాను. ఎందుకంటే అంతకు మూడు రోజుల ముందే ఆమెతో కలిసి పనిచేశాను' 'దివ్యభారతి చనిపోయే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి చేసుంటే ఈమె పెద్ద స్టార్ అయ్యేది. అయితే దివ్య భారతి చావు ప్రమాదం మాత్రమే అని నా అభిప్రాయం. కాస్త డ్రింక్ చేయడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. నాకు తెలిసి అయితే ఎలాంటి సమస్యలు లేవు' అని కమల్ సదానా చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) -
మాస్ గోట్గా సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). దివ్య భారతి హీరోయిన్. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో ఒక చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ లుక్‌లో కనిపించారు సుధీర్. ‘‘మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా షురూ
సుడిగాలి సుధీర్ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్ఎస్4’ (వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్ బాబు, కేఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్ దామోదర ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్‌కి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్‌కి థ్యాంక్స్’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
దివ్య భారతి చేజారిన పెద్ద సినిమాలివే
బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మసులో చెరగని ముద్ర వేసుకుంది దివ్య భారతి. తెలుగుతో పాటు దీవానా, దిల్ కా క్యా కసూర్, జాన్ సే ప్యారా వంటి పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె అందం, అభినయానికి హిందీ ప్రేక్షకులు సైతం మంత్రముగ్ధులయ్యారు. 16 ఏళ్లకే నటనారంగంలోకి అడుగు పెట్టిన ఆమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేడు గడించింది. అదే సమయంలో 1993 ఏప్రిల్ 5న ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఆమె సినిమాలు కొన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోగా, మరికొన్ని ఆమె స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసి షూటింగ్ జరుపుకున్నాయి. ఆమె అకాల మరణం కారణంగా పలు హిట్ సినిమాల్లో దివ్య భారతి స్థానంలో పలువురు బాలీవుడ్ తారలను తీసుకున్నారు. నేడు ఆమె జయంతి సందర్భంగా తన చివరి రోజుల్లో చేజారిన సినిమాలేంటి? ఆమె పాత్రలను ఎవరు భర్తీ చేశారనేది ఓ సారి చదివేద్దాం... కర్తవ్య రాజ్ కన్వర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో దివ్య భారతిని కథానాయికగా డిసైడ్ అయ్యారు. కొంత భాగం చిత్రీకరణ కూడా జరిపారు. కానీ సడన్‌గా ఆమె మరణించడంతో ఆమె స్థానంలోకి జూహీ చావ్లాను తీసుకోక తప్పలేదు. హల్చల్ 1995లో హల్చల్ సినిమాతో దర్శకుడిగా వెండితెరపై కాలు మోపాడు అనీస్ బజ్మీ. తొలి చిత్రం కావడంతో ఎలాగైనా దివ్య భారతినే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె మరణం ఈ సినిమా యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. తర్వాత దర్శకుడు ఆమె ప్లేస్‌లో కాజోల్‌ను తీసుకున్నాడు. ఇందులో కాజోల్ భర్త అజయ్ దేవ్‌గణ్ హీరో. మోహ్రా స్టార్ నటులు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి సినిమా మెహ్రాలో నటించే చాన్స్ కొట్టేసింది దివ్య భారతి. ఈ మేరకు కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ ఆమె ఆకస్మిక మరణం తర్వాత రవీనా టండన్‌ను రీప్లేస్ చేశారు. రాజీవ్ రాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. లాడ్లా అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లాడ్లా సినిమాకు సైన్ చేసింది దివ్య.. కానీ తన సడన్ డెత్ తర్వాత ఆమె పాత్రను శ్రీదేవి పోషించింది. ఈ చిత్రంలో రవీనా టండన్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా దివ్య భారతి, నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఆమె తండ్రి అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి మరీ అతడితో ఏడడుగులు నడిచింది. కానీ పెళ్లైన పది నెలలకే ఐదో అంతస్థులోని బాల్కనీ నుంచి దూకి మరణించింది. అప్పుడామె వయసు 19ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. చదవండి: సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్ ‘ఆస్కార్ నటితో మీకు పోలికా.. ప్లీజ్ బ్రేక్ తీసుకొండి’ -
దివ్యభారతి మరణించిన రాత్రి ఏం జరిగింది?
ముంబై: నటి దివ్యభారతి మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదని ఆమె తండ్రి ఓమ్ భారతి వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఆమె మరణించిందని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. నేడు దివ్యభారతి 45వ జయంతి సందర్భంగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దివ్యభారతి మరణంపై వ్యక్తమైన అనేక అనుమానాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన దివ్యభారతి 1993, ఏప్రిల్ 5న అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. దివ్యభారతి ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను ఎవరూ హత్య చేయలేదని ఓమ్ భారతి చెప్పారు. ఆమె మరణించడానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందనేది ఆయన మాటల్లోనే... ‘ ఆ రోజు దివ్య మద్యం సేవించింది. అంత ఎక్కువగా ఏమీ తాగలేదు. ఆమె కుంగుబాటుకు లోనుకాలేదు. అది ప్రమాదం మాత్రమే. పిట్టగోడపై కూర్చునివున్న ఆమె నియంత్రణ కోల్పోయి కింద పడిపోయింది. దివ్య ఫ్లాట్‌కు తప్ప ఆ అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లకు గ్రిల్స్ ఉన్నాయి. కింద ఎప్పుడూ కార్లు పార్క్ చేసి వుండేవి. కానీ ఆ రాత్రి ఒక్క కారు కూడా లేదు. దివ్య నేరుగా కింద పడిపోయింది. నేను షాక్ గురయ్యాను. స్పృహ కోల్పోయాను. వైద్య బృందం వచ్చే సరికి ఆమె కొనప్రాణంతో ఉంది. దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింద’ని ఓమ్ భారతి వివరించారు. -
దివ్యభారతి తల్లి కన్నుమూత
సాక్షి, ముంబై: దివంగత నటి దివ్యభారతి తల్లి మీటా భారతి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఏప్రిల్ 20న స్వగృహంలో కన్నుమూశారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దివ్యభారతి కజిన్, నటి కైనాత్ ఆరోరా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో నటి దివ్యభారతి చనిపోయిన విషయం తెలిసిందే. కూతురి హఠాన్మరణంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మీటా అనారోగ్యం బారిన పడ్డారు. చివరకు కూతురు చనిపోయిన పాతికేళ్లకు ఇప్పుడు మీటా కన్నుమూశారు. 1993 ఏప్రిల్ 5న ముంబై వెర్సోవాలోని తాను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి పడిపోయి నటి దివ్యభారతి మృతి చెందారు. ఆమె మృతిపై అనుమానాలు నెలకొనగా.. తలకు బలమైన గాయం కారణంగానే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. -
శ్రీదేవి.. దివ్యభారతి.. ఓ మిస్టరీ!
న్యూఢిల్లీ : మనకాలపు అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంత పరిచింది. దుబాయ్‌లో జరుగుతున్న ఓ కుటుంబ వేడుకలో పాల్గొన్న ఆమె తీవ్ర గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలారు. యావత్ అభిమానుల్ని శోకసంద్రంలో ముంచుతూ ఆమె దివ్యలోకాలకు ఏగారు. ఆమె హఠాన్మరణం.. ఒకప్పటి ప్రముఖ నటి దివ్యభారతిని గుర్తుకుతెస్తోంది. రూపురేఖల విషయంలో శ్రీదేవితో దగ్గరి పోలికలు ఉన్న దివ్యభారతి 19 ఏళ్ల వయస్సులో అనుమానాస్పద పరిస్థితుల నడుమ కన్నుమూశారు. ఆమె మరణం ఒక మిస్టరీగా మారింది. నిజానికి 90వ దశకంలో శ్రీదేవి వెండితెరపై వెలిగిపోతున్న సమయంలోనే దివ్యభారతి చిత్రసీమలోకి ఆరంగేట్రం చేశారు. అప్పట్లో అందరూ దివ్యభారతిని శ్రీదేవి చెల్లెలు అంటూ పిలిచేవారు. ఒకానొక దశలో శ్రీదేవి స్థానాన్ని దివ్యభారతి తన నటనతో, అందంతో భర్తీ చేస్తుందని భావించారు. కానీ, ఆమె అకాల మృతి చిత్ర పరిశ్రమను నివ్వెరపోయేలా చేసింది. షాకింగ్ విషయమేమిటంటే దివ్యభారతి పుట్టినరోజు తేదీకి సమీపంలోనే శ్రీదేవి కన్నుమూయడం. 1974 ఫిబ్రవరి 25న దివ్యభారతి జన్మించింది. దివ్యభారతి పుట్టినతేదీకి ఒక రోజు ముందు దుబాయ్‌లో శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 90వ దశకంలో దివ్యభారతి వరుస సినిమాలతో బాలీవుడ్లో ప్రభంజనం సృష్టించింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె వరుస సినిమాలు బాలీవుడ్‌ను ముంచెత్తాయి. అనతికాలంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం మూడేళ్ల బాలీవుడ్ కెరీర్లో దివ్యభారతి 13 సినిమాలు చేసింది. అన్ని దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే. కానీ, 1993లో ఏప్రిల్ 5న దివ్యభారతి మద్యంమత్తులో (?) తన బాల్కనీ నుంచి దురదృష్టవశాత్తు పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె మిస్టిరీయస్ మృతితో ఆమె ఒప్పుకొని సంతకం చేసిన పలు సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడింది. అంతకుముందే దివ్యభారతి ‘లాడ్లా’ సినిమాలో చాలావరకు నటించింది. అయితే, ఆమె చనిపోవడంతో ఆమె స్థానంలో శ్రీదేవిని లీడ్రోల్లోకి తీసుకున్నారు. అనిల్ కపూర్, శ్రీదేవి, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘లాడ్లా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ సమయంలో శ్రీదేవి, దివ్యభారతి ఒకరికొకరు ప్రత్యామ్నాయం అని బాలీవుడ్ దర్శక నిర్మాతలు భావించేవారు. -
నిజం దివ్యభారతికే ఎరుక!
అప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటన.. తలచుకుంటే నేటికీ మనసుని మెలిపెడుతుంది. వేలాది హృదయాలను కదిలిస్తుంది. ఆమె సజీవంగా ఉంటే బాగుండు కదా.. అనిపిస్తుంది. ఊహ తెలియని వయసులోనే స్టార్డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. ఎన్నో అనుమానాలకు తెరలేపిన ఆమె మరణానికి కారణమేంటి..? ఇంతకీ ఆరోజేం జరిగింది..? 1993.. ఏప్రిల్ 5.. మరో అరవై నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని సునామీ లాంటి వార్త ఒక్కసారిగా ముంచెత్తింది. టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందన్నదే ఆ వార్త! పంతొమ్మిదేళ్ల వయసు, మోయలేనంత స్టార్డమ్, అసాధారణ భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు మరణిస్తుంది..? ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. సక్సెస్ కిక్కును తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు. ఏళ్లు గడిచినా ముంబై పోలీసులు మాత్రం ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. ఆమె మరణం నేటికీ మిస్టరీనే! కానీ, ఆ రోజు దివ్యభారతి చాలా హుషారుగా ఉందని చెబుతారు దగ్గరనుంచి చూసినవాళ్లు. చెన్నై నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై చేరుకున్న ఆమె.. తన సంపాదనతో ఓ అపార్ట్మెంట్లోని ఇంటిని కొనుగోలు చేయాలని భావించింది. అందులో భాగంగానే సోదరుడు కునాల్‌తో కలిసి ఆ నాలుగు పడకగదుల ఇంటిని సందర్శించింది. ముంబైలాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకోవాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు..? అందుకే, డీల్ పూర్తి కాగానే అందరికీ సంబరంగా చెప్పుకొచ్చింది. కానీ, ఆ ఫ్లాట్ ఆమె కోసం కాదు. ఆమె తల్లిదండ్రుల కోసం! అవును, అప్పటికే దివ్య భారతికి వివాహమయింది. భర్త, ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్వాలాతో కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఆమెకు ప్రత్యేకంగా ఇంటి అవసరం ఏముంటుంది..? కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలై ఉండటంతో తర్వాతి రోజు హైదరాబాద్‌లో చేయాల్సిన షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. నిర్మాతలకు ఫోన్ చేసి, తాను అలసిపోయానని.. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది. అలా రాత్రి పదిగంటలకు తులసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అప్పటికి పనిమనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది. చిన్ననాటి నుంచీ దివ్యభారతి ఆలనాపాలనా చూసుకుంటోంది ఆమే. దివ్యభారతి బెడ్రూమ్లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త డా.శ్యామ్ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వస్తున్నానని చెప్పిందామె. దీంతో వారికి వెల్కమ్ చెప్పేందుకు మద్యం బాటిల్లతో సిద్ధమైంది దివ్యభారతి. ముగ్గురూ కలిసి ఆమె బెడ్రూమ్లోనే మద్యం సేవించారు. కొద్దిసేపు డ్రెస్సుల గురించీ, డిజైన్ల గురించీ చర్చించారు. అమృత వారికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడుతోంది. ఓవైపు వంట చేస్తూనే, మరోవైపు కిచెన్ నుంచే దివ్యభారతితో మాట్లాడుతోందామె. హీరోయిన్ కూడా బిగ్గరగా అరుస్తూ ఆమెకు సమాధానాలిస్తోంది. అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది దివ్యభారతి. మరోవైపు నీతా, శ్యామ్ లుల్లాలు టీవీ చూస్తూ ఉండిపోయారు. బాల్కనీలోని తలుపుల్లేని కిటికీ ముందు నిల్చుంది దివ్యభారతి. అక్కడి నుంచే స్వచ్ఛమైన గాలికోసమన్నట్టుగా తలను బయట పెట్టి చూస్తూ పనిమనిషితో బిగ్గరగా మాట్లాడసాగింది. ఏం జరిగిందో ఏమో.. పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆమె కాళ్లు పట్టుతప్పాయి. ముందుకు కూలబడిపోయింది. ఐదో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి చుట్టుపక్కలవారు లేచి చూశారు. అంతే.. రక్తపు మడుగులో దివ్యభారతి కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అలా కొద్ది సమయంలోనే దగ్గర్లోని కూపర్ ఆస్పత్రికి ఆమెను చేర్చారు. అయితే, హాస్పిటల్లోకి అడుగుపెట్టగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఇప్పటివరకూ ఆమె మరణం విషయంలో వినిపిస్తోన్న కథనం. దీనిపై నీతా, శ్యామ్ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. భర్త సాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. వంటమనిషి అమృత.. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక నెలరోజులకే గుండె ఆగి చనిపోయింది. దీంతో ఇది హత్య అన్న వాదనలకు బలం దొరకలేదు. కానీ, ఈ మరణం వెనక దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ప్రమేయం ఉందనే పుకార్లు హల్చల్ చేశాయి. సాజిద్ ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేశాడనీ కొంతమంది సిద్ధాంతీకరించారు. కానీ, ముంబై పోలీసులు ఆ దిశగా ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. దీంతో 1998 వరకూ కొనసాగిన విచారణ.. ఆ ఏడాది ముగిసిపోయింది. మరణ కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసును మూసివేశారు. ఇంతకీ ఆమెది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా..? నిజం దివ్యభారతి మాత్రమే చెప్పగలదు..!