దివ్య భారతి.. ఈ హీరోయిన్ పేరు ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు. వెంకటేశ్ 'బొబ్బిలి రాజా' మూవీలో తనదైన యాక్టింగ్ తో కట్టిపడేసింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో కేవలం 19 వయసులోనే ఐదో అంతస్తు నుంచి పడి చనిపోయింది. అసలేం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. తాజాగా ఓ బాలీవుడ్ హీరో దివ్య భారతి మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన దివ్య భారతి.. పలువురు అగ్రహీరోలతో కలిసి పనిచేసింది. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా కమల్ సదానా అనే బాలీవుడ్ హీరోతో కలిసి షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్య భారతి ప్రమాదవశాత్తూ చనిపోయిందనే అనుకుంటున్నానని అన్నాడు.
(ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)
'దివ్య భారతి మరణవార్త నేను తీసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఎందుకంటే మంచి టాలెంట్ ఉన్న యాక్టర్ ఆమె. కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉండేది. అందుకే చనిపోయిందని ఫస్ట్ వినగానే షాకయ్యాను. ఎందుకంటే అంతకు మూడు రోజుల ముందే ఆమెతో కలిసి పనిచేశాను'
'దివ్యభారతి చనిపోయే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి చేసుంటే ఈమె పెద్ద స్టార్ అయ్యేది. అయితే దివ్య భారతి చావు ప్రమాదం మాత్రమే అని నా అభిప్రాయం. కాస్త డ్రింక్ చేయడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. నాకు తెలిసి అయితే ఎలాంటి సమస్యలు లేవు' అని కమల్ సదానా చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment