
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఓ వైపు కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా చేస్తున్నాడు. అయితే తనకి అంత పాపులారిటి తెచ్చిపెట్టిన జబర్థస్త్ అనే కామెడీ షో నుంచి ఇటీవలె సుధీర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. మళ్లీ ఆ షోకు వస్తే బాగుండంటూ అభిమానులంత ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పాడు.
చదవండి: సుకుమార్‌ని కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్, ఎందుకో?
ప్రస్తుతం సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నవంబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా జబర్థస్త్ నుంచి బయటకు రావడంపై క్లారిటీ ఇచ్చాడు. తన లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటని అడగ్గా.. జబర్థస్త్ షో అన్నాడు. 2013 ఫిబ్రవరి 7వ తేదీ తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నాడు. తనని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆ షోనే అన్నాడు. మరి వదిలేశారు అని యాంకర్ అడగ్గా.. రాలేదని, మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది: శర్వానంద్
త్వరలోనే మళ్లీ ఆ కామెడీ షోకి రీఎంట్రీ ఇస్తానని, కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే ఆ షోను నుంచి బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు మాట్లాడుతూ.. ‘జబర్థస్త్ షోని విడిచి పెట్టలేదు. ఒక 6 నెలలు బ్రేక్ తీసుకున్నా అంతే. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే నేను గ్యాప్ తీసుకున్నా. ఇదే విషయాన్ని నిర్మాతలను కూడా వివరించా. వారు కూడా ఒకే అన్నారు. అతి త్వరలోనే మళ్లీ జబర్థస్త్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్ మాటలు విని అతడి ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుషి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment