![Jabardasth Comedians get Doctor Laughter Awards 2020 - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/2/Sudigali_Sudheer_Award.jpg.webp?itok=Az8rB1Vp)
సుడిగాలి సుధీర్‌కు అవార్డు ప్రదానం
సాక్షి, హైదరాబాద్: నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదంతో విక్రమ్ ఆర్ట్స్ విక్రమ్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్ కేర్ ఇన్నోవేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌సిఐఎస్) ఆధ్వర్యంలో డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020 కార్యక్రమం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయశ్రీ, స్వప్న, నాగిరెడ్డి, చంద్రముఖి చంద్రశేఖర్, యాదమ్మ రాజు, జీవన్, సూర్య తేజు, సుబ్రాన్త్‌లకు డాక్టర్ లాఫ్టర్ అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారింలో ‘జబర్దస్త్’ కమెడియన్లు ఎక్కువగా ఉన్నారు. సందర్భంగా రసమయి బాలకిషన్ తమ పాటలతో ఉర్రూతలుగించారు. ఈ సందర్భంగా బి ప్రిపేర్డ్ ఎడ్యుకేషన్ యాప్‌ను విడుదల చేశారు. (చదవండి: బన్నీ మెచ్చిన షార్ట్ ఫిల్మ్)
Comments
Please login to add a commentAdd a comment