
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈచిత్రం నవంబర్ 18న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చారు మేకర్స్.
చదవండి: అంత తెలిగ్గా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన
‘‘వయసు తక్కువ ‘షో’లు ఎక్కువ.. నువ్వు శనివారం పుట్టావా? శనిలా తగులుకున్నావ్, రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే’’ డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను మొట్టమొదటి సారి వీడిలో చూశాను సార్’ వంటి పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాలపై అంచాలను పెంచేస్తున్నాయి. అలాగే ఇందులో సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. గెహ్నాసిప్పి గ్లామర్, సప్తగిరి కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.