యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్! | Sudigali Sudheer Gives Clarity On Marriage With Anchor Rashmi Gautam - Sakshi
Sakshi News home page

Sudheer-Rashmi Marriage: పెళ్లి గురించి సుడిగాలి సుధీర్ క్లారిటీ.. రష్మీతో కలిసి త్వరలో!

Nov 21 2023 7:48 PM | Updated on Nov 21 2023 7:59 PM

Sudigali Sudheer Clarity On Marriage With Anchor Rashmi - Sakshi

సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే దాదాపు అందరికీ గుర్తొచ్చే పేరు యాంకర్ రష్మీ. వీళ్లిద్దరూ ఏ ముహుర్తాన కలిసి 'జబర్దస్త్' చేశారో గానీ వీళ్లకి వచ్చినంత క్రేజ్ మరో జంటకు రాలేదని చెప్పొచ్చు. అసలు వీళ్లిద్దరూ నిజంగా లవర్సా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు? ఇలా బోలెడన్ని క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అలా తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్‌కి వచ్చిన సుడిగాలి సుధీర్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

మేజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. ఓ సాధారణ కమెడియన్‌గా 'జబర్దస్త్' షోలో అడుగుపెట్టాడు. కొన్నాళ్లకు టీమ్ లీడర్‌ అయ్యాడు. మరోవైపు యాంకర్ రష్మీతో లవ్వాటతో బాగా పాపులర్ అయిపోయాడు. అనంతరం కొన్నాళ్లకు సినిమా హీరో అయిపోయాడు. 'గాలోడు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు 'కాలింగ్ సహస్ర' మూవీతో డిసెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్నాడు. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అందులో రష్మితో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న సుధీర్‌ని అడిగారు. దీనికి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్!)

'ఈ ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు థ్యాంక్స్. రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో' అని సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు.

దీనిబట్టి చూస్తే సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడనమాట. మరోవైపు రష్మీతో సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇద్దరికి తగ్గ కథ కోసం చూస్తున్నామని, దొరికినప్పుడు కచ్చితంగా కలిసి నటిస్తామని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement