
లాక్‌డౌన్‌లో నవ్యస్వామి, రవికృష్ణ , సాక్షి వివ, భరత్వాజ్, హరికృష్ణ వంటి పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కానీ ఆ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. తాజాగా టీవీ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. అక్టోబర్ 18న అతడికి కరోనా సోకినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. [ చదవండి : అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా చేయండి ]
మరోవైపు దీనిపై అధికారిక ప్రకటన లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ సుధీర్‌కు కరోనా పాజిటివ్ అన్న విషయం నిజమే అయితే ఈ మధ్య కాలంలో ఆయన పాల్గొన్న షూటింగ్స్ యూనిట్ సభ్యులు కూడా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోక తప్పదు. ముఖ్యంగా దసరా స్పెషల్ ఈవెంట్ 'అక్కా ఎవడే అతగాడు'లో రష్మీ, వర్షిణి, సంగీత, శేఖర్ మాస్టర్ కూడా పాల్గొనడంతో వారికి కూడా కరోనా సోకే అవకాశాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా సుడిగాలి సుధీర్ మొదట్లో మ్యాజిక్ షోలు చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్ షోలో అడుగు పెట్టారో ఇక వెనుతిరిగి చూసుకునే అవసరమే లేకపోయింది. జబర్దస్త్‌తోపాటు ఢీ సహా పలు షోలలో కనిపిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌లోనూ కరోనాను లెక్క చేయకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు అహర్నిశలు శ్రమించారు. (విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపు)