సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జీ.ఓ.ఏ.టీ’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
కాగా శుక్రవారం (మే 19) సుధీర్ బర్త్‌డేని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మంచి కథాంశంతో తెరకెక్కుతున్న మా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి!
ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘జీ.ఓ.ఏ.టీ’ లాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం.
Comments
Please login to add a commentAdd a comment