
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడికి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి బుల్లితెర స్క్రిన్‌మీద కనిపిస్తే ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు.

జబర్దస్త్ ద్వారా వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

పలు షోలలో వీరిద్దరి పెళ్లి చేయడం.. వీరిద్దరు కూడా తాము రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు స్క్రీన్‌పై ప్రవర్తించడంతో నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.

అయితే వాస్తవంగా వీరిద్దరు మంచి స్నేహితులు మాత్రమే. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో అటు రష్మి, ఇటు సుధీర్ చెప్పారు

స్నేహితులని చెప్పినా కూడా బుల్లితెరపై ప్రేక్షకులు.. సుధీర్-రష్మిలను జంటగానే చూడడానికి ఇష్టపడుతున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రష్మి-సుధీర్‌ల పెళ్లి ఎప్పుడని కామెంట్ చేస్తుంటారు.

తాజాగా మరోసారి రష్మి పెళ్లిపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

నేడు(మే 20) సుధీర్ బర్త్‌డే. అయితే రష్మి బర్త్‌డే విషెస్ చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఓ ఫోటో షూట్ చేసి వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.

దీంతో సుధీర్ బర్త్‌డే కానుకగానే ఇలా ఫోటోలు షేర్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


‘రష్మి.. సుధీర్‌కి బర్త్‌డే విషెస్ చెప్పావా? సుధీర్‌ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు

రష్మి ప్రస్తుతం పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తునే.. అటు సినిమాల్లోనూ నటిస్తోంది.