కామెడీ షోతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్‌ | AHA Launches Anil Ravipudi As Chairman Of Comedy Stock Exchange Show | Sakshi
Sakshi News home page

Comedy Stock Exchange: కామెడీ షోతో అనిల్‌ రావిపూడి ఓటీటీ ఎంట్రీ!

Published Thu, Oct 27 2022 7:49 PM | Last Updated on Thu, Oct 27 2022 7:49 PM

AHA Launches Anil Ravipudi As Chairman Of Comedy Stock Exchange Show - Sakshi

ప్రముఖ తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' షోను ఓటీటీ వేదికగా లాంచ్ చేయబోతున్నారు. ''అరే.. స్టాక్స్ దమ్ము లేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిల్లిపోతుంది'' అంటున్నారు అనిల్‌. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది? ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్‌ చేసేది కామెడీనే. ఈ నవంబర్‌ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్‌ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌' నవంబర్‌ నుంచి మొదలు కానుంది. ఎస్‌ఓఎల్‌ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ షో ట్రైలర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. వేణు, ముక్కు అవినాష్‌, సద్దాం, ఎక్స్‌ప్రెస్‌ హరి, భాస్కర్‌, జ్ఞానేశ్వర్‌ చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్‌ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు.

ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటీటీలో అడుగుపెడుతునందుకు ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌'కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. నవంబర్‌లో ఈ కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఆహాలో ప్రసారం కానుంది.

చదవండి: ఆటోలో ప్రయాణించిన నటుడు, వీడియో వైరల్‌
ఇనయ అదిరిపోయే ట్విస్ట్‌.. షాకైన సూర్య, శ్రీహాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement