![R Narayana Murthy Discharged From NIMS Hospital](/styles/webp/s3/article_images/2024/07/20/1_12_1.jpg.webp?itok=ykgVV9qv)
ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కూడా ఆయన్ను పరామర్శించారు. నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.
నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనకు చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్పతో పాటు అక్కడి వైద్యులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నాని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment