
సాక్షి, హైదరాబాద్: సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ, రాజ్యాంగం అమలు, రాష్ట్రాల హక్కుల సాధన కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి తన మద్దతు తెలిపారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను నిరాకరించి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పెత్తనం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదని.. అన్ని రాష్ట్రాలు, 130 కోట్ల మంది దేశ ప్రజలు అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ ఇవ్వలేదని, ఇది ఏమైనా వారి అబ్బ సొత్తా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment