సాక్షి, కాకినాడ సిటీ: ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరమని సినీ నటుడు, దర్శక నిర్మా త ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వస్థలమైన రౌతులపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శివాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఊరిలో గుడి ఉంటే మనిషి పాపభీతితో తప్పులు చేయకుండా ఉంటాడని, బడి ఉంటే చదువు ద్వారా జ్ఞానం, వికా సం వస్తాయని చెప్పారు. ఆసుపత్రి ఉంటే అనారోగ్య సమస్య వచ్చినవారు కుదుట పడతారన్నారు. శివాలయం పునఃప్రతిష్ఠకు వేలాదిగా ఊరి జనంతో పాటు చుట్టుపక్కల ప్రజలు, భక్తులు తరలిరావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
శివాలయం పునర్నిర్మాణం అంశాన్ని ఆలయ కమిటీ తన దృష్టికి తీసుకు రాగా.. గత ప్రభుత్వంలో దేవదాయ శాఖ ఆధ్వర్యాన రూ.55 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మాజీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజస్తంభం ఏర్పాటుకు తన శాఖ నుంచి ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుమతులు ఇచ్చారని చెప్పారు. గ్రామ పెద్దలు పైలా సాంబశివ, అరిగర్ల రామకృష్ణ, ఈరంకి ప్రభాకరరావు, యిటంశెట్టి భాస్కరరావు, వాసిరెడ్డి కృష్ణమూర్తి, నాగబాబు, ఊరిలోని ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు చందాలు ఇచ్చి ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని నారాయణమూర్తి కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment