‘సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనపై సినిమా తీస్తా’ | R Narayana Murthy: Will Make A Movie On English Medium On Govt Schools | Sakshi
Sakshi News home page

‘సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనపై సినిమా తీస్తా’

Published Mon, Dec 7 2020 2:32 PM | Last Updated on Mon, Dec 7 2020 2:43 PM

R Narayana Murthy: Will Make A Movie On English Medium On Govt Schools - Sakshi

సాక్షి, విశాఖపట్నం : సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించనున్నట్లు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఆదివారం నర్సీపట్నం వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనా చిత్ర పరిశ్రమంపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు. చదవండి: అపర భగీరథుడు.. సీఎం జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement