ఆర్‌ నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్‌ అవార్డు | Ramineni Foundation Award celebrations will be conduct in vijayawada | Sakshi
Sakshi News home page

ఆర్‌ నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్‌ అవార్డు

Published Sun, Oct 8 2017 5:24 PM | Last Updated on Sun, Oct 8 2017 5:24 PM

Ramineni Foundation Award celebrations will be conduct in vijayawada

విజయవాడ: ఈ నెల 12న నగరంలో డా. రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు.

ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సినీ రంగంలో అతను చేసిన కృషికి ఫలితంగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్‌. నాగేశ్వరరావుకు కూడా రామినేని పురస్కారం వరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement